Monday, 27 March 2017

వైఫైతో... జాగ్రతగా ఉండండి & మీ దగ్గరలో వైఫై సిగ్నల్ ఉందా? తెలుసుకోవాలా ?

వైఫైతో... జాగ్రతగా ఉండండి

మా వైఫైని ఎవరో వాడేస్తున్నారు’... అంటూ చాలామంది ఆందోళన పడుతుంటారుసెక్యూర్డ్‌ నెట్‌ కనెక్షన్లు వాడకపోవడంరూటర్ల రక్షణ విషయంలో ఆదమరిచి ఉండటంపాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల మీ వైఫైని ఇతరులు వినియోగించేస్తుంటారుకొన్ని ప్రాథమిక రక్షణ చర్చలురూటర్ల సెట్టింగ్స్లో మార్పులు చేసి మీ వైఫైని ఇతరులు అనధికారికంగా వినియోగించకుండాఅలాగే మీరు హ్యాకర్ల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు. 



1. ప్రతి వైఫై రూటర్కి Netgear, Dlink ఇలా డీఫాల్ట్గా యూజర్‌ నేమ్‌ ఉంటుందిఅలాగే  డీఫాల్ట్‌ పాస్వర్డ్‌ కూడా ఉంటుందివాటిని రూటర్‌ సెట్టింగ్స్‌ పేజీలోకి వెళ్లి మార్చుకోవాలిరూటర్‌ మాన్యువల్లో దానికి సంబంధించిన వెబ్సైట్‌ చిరునామా ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్లి పాస్వర్డ్లు మార్చుకోవచ్చు.
2.మొబైల్కు ఓఎస్లా రూటర్కు ఫర్మ్వేర్‌ ఉంటుందిరూటర్‌ ఇన్స్టాల్‌ చేసుకున్నాక.. దాని ఫర్మ్వేర్ను కచ్చితంగా అప్డేట్‌ చేసుకోవాలిఅప్పుడు రక్షణపరమైన ఇబ్బందులు ఉండవు. వైఫై రూటర్ను ఇన్స్టాల్‌ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఆప్షన్లో పాస్వర్డ్‌ తరహాను ఎంపిక చేసుకునే దగ్గర None అని ఉంటుందిఅంటే పాస్వర్డ్‌ అవసరం లేకుండానే ఇతరులు మీ వైఫైను కనెక్ట్‌ చేసుకోవచ్చు స్థానంలో WPA2 ను ఎంచుకోండితర్వాత దాని దిగువన ఉండే బాక్స్లో పాస్వర్డ్‌ ఎంటర్‌ చేసి క్రియేట్‌ చేసుకోండి.
3.స్నేహితులకుతెలిసినవాళ్లకు ఒక్కోసారి వైఫై పాస్వర్డ్‌ ఇస్తుంటారు తర్వాత వారి మొబైల్లో ఫర్గెట్‌ నెట్వర్క్‌ చేయడం మరచిపోయుండొచ్చుఅందుకే తరచుగా వైఫై పాస్వర్డ్ను మార్చుకోవడం మంచిది.
4.మొబైల్లో వైఫైని ఆన్‌ చేసినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వైఫై నెట్వర్క్ పేర్లు కనిపిస్తాయిఅలా ఇతరులకు మీ నెట్వర్క్‌ కనిపించకుండా చేసుకోవచ్చురూటర్‌ సెట్టింగ్స్లోకి వెళ్లి నెట్వర్క్‌ పేరు అందరికీ కనిపించకుండా చేయొచ్చుఅయితే మీ వైఫై ఎస్ఎస్ఐడీ (యూజర్‌ నేమ్‌) మీకూ కనిపించదుదాన్ని గుర్తుంచుకోవాలి. 
5.నేను వాడుతున్నది సెక్యూర్డ్‌ నెట్‌ కనెక్షనేనా అనే అనుమానం మీకూ ఉందా? అయితే వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్వర్క్‌(వీపీఏసాఫ్ట్వేర్‌ ఉపయుక్తంగా ఉంటుందిమొబైల్‌ లేదా ల్యాప్టాప్లో  సాఫ్ట్వేర్‌ లేదా ఆప్‌ వాడితే హ్యాకర్ల దాడి నుంచి వీలైనంతవరకు తప్పించుకోవచ్చు. 
6. మా వీధి చివరివరకు మా వైఫై సిగ్నల్స్‌ వస్తాయి’ అని అంటుంటారు కొందరుఇల్లుఆవరణలో వైఫై సిగ్నల్‌ వస్తే చాలు కదాఅందుకే రూటర్‌ సెట్టింగ్స్లోకి వెళ్లి రూటర్‌ సిగ్నల్‌ రేంజ్ను తగ్గించుకోండిసాధారణంగా 802.11ఎన్,802.11బి రేంజ్లు ఉంటాయివాటిని తగ్గించి 802.11జిగా మార్చుకుంటే సిగ్నల్‌ రేంజీతగ్గుతుంది

మీ దగ్గరలో వైఫై సిగ్నల్ ఉందా? తెలుసుకోవాలా ?
దగ్గర్లో ఎక్కడైనా వైఫై సౌకర్యం ఉందా?’... చాలామంది నోట ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి సమాధానం చెప్పడం కాస్త కష్టమే. అయితే మీ మొబైల్లో wifi master key ఆప్ఉంటే అదే మీకు సమాధానం చెబుతుంది. మీకు దగ్గర్లో ఉన్న వైఫై స్పాట్ వివరాల్ని స్కాన్చేసి చూపిస్తుంది. ఆప్ఓపెన్చేయగానే మీ పరిసరాల్లో ఉన్న వైఫై స్పాట్ వివరాలు కనిపిస్తాయి. మీ పరిసరాల్లో వైఫై స్పాట్లు లేకపోతే... గూగుల్మ్యాప్ఓపెన్అవుతుంది. అందులో మీ సమీపంలో (సుమారు 15 కిమీ) ఉన్న వైఫైల వివరాలు ఐకాన్లుగా కనిపిస్తాయి. అందులో ఫ్రీ వైఫైలు ఏవి, ఓపెన్వైఫైలు ఏవి అనేదీ తెలుస్తుంది. దీంతోపాటు మీరు వినియోగిస్తున్న వైఫై సిగ్నల్ఎంత బలంగా ఉందనే వివరాలు తెలుసుకోవచ్చు. మీరు వాడుతున్న వైఫై ఎంతవరకు సురక్షితమనే సమాచారమూ తెలుస్తుంది. 

No comments:

Post a Comment