Monday 27 March 2017
ఇంటర్నెట్ డేటాను ఇతరులతో పంచుకోండి
ఇంటర్నెట్ డేటాను ఇతరులతో పంచుకోండి
ఓ మొబైల్లోని డేటాను హాట్స్పాట్ సాయంతో వేరే మొబైల్లో వాడుకోవడం కొత్తేమీ కాదు. దీని కోసం వైఫై హాట్స్పాట్ ఆన్ చేయడం, వేరే మొబైల్లో దాన్ని వైఫైతో కనెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత పాస్వర్డ్ ఇవ్వడం... లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఒక మొబైల్లోని డేటాను మరో మొబైల్తో పంచుకునేలా గూగుల్ సాంకేతికతను సిద్ధం చేసింది. దీని కోసం ఆ రెండు మొబైళ్లు ఒకే మెయిల్ ఐడీతో లాగిన్ అయి ఉంటే సరిపోతుంది. అంటే మీ దగ్గర మొబైల్, ట్యాబ్/స్మార్ట్ఫోన్ ఉన్నాయనుకోండి. ఓ మొబైల్లో ఉన్న డేటాను ఈ సౌకర్యంతోవేరే మొబైల్/ట్యాబ్లో వాడుకోవచ్చు. దీని పేరే ఇంటర్నెట్ టెతెరింగ్. ప్రస్తుతం అమెరికాలోని ఆండ్రాయిడ్ నూగట్ ఆధారిత పిక్సల్, నెక్సస్ మొబైళ్లకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆప్షన్ను ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి
వైఫైతో... జాగ్రతగా ఉండండి & మీ దగ్గరలో వైఫై సిగ్నల్ ఉందా? తెలుసుకోవాలా ?
వైఫైతో... జాగ్రతగా ఉండండి
మా వైఫైని ఎవరో వాడేస్తున్నారు’... అంటూ చాలామంది ఆందోళన పడుతుంటారు. సెక్యూర్డ్ నెట్ కనెక్షన్లు వాడకపోవడం, రూటర్ల రక్షణ విషయంలో ఆదమరిచి ఉండటం, పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల మీ వైఫైని ఇతరులు వినియోగించేస్తుంటారు. కొన్ని ప్రాథమిక రక్షణ చర్చలు, రూటర్ల సెట్టింగ్స్లో మార్పులు చేసి మీ వైఫైని ఇతరులు అనధికారికంగా వినియోగించకుండా, అలాగే మీరు హ్యాకర్ల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు.
1. ప్రతి వైఫై రూటర్కి Netgear, Dlink ఇలా డీఫాల్ట్గా యూజర్ నేమ్ ఉంటుంది. అలాగే ఓ డీఫాల్ట్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. వాటిని రూటర్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి మార్చుకోవాలి. రూటర్ మాన్యువల్లో దానికి సంబంధించిన వెబ్సైట్ చిరునామా ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్లి పాస్వర్డ్లు మార్చుకోవచ్చు.
2.మొబైల్కు ఓఎస్లా రూటర్కు ఫర్మ్వేర్ ఉంటుంది. రూటర్ ఇన్స్టాల్ చేసుకున్నాక.. దాని ఫర్మ్వేర్ను కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు రక్షణపరమైన ఇబ్బందులు ఉండవు. వైఫై రూటర్ను ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఆప్షన్లో పాస్వర్డ్ తరహాను ఎంపిక చేసుకునే దగ్గర None అని ఉంటుంది. అంటే పాస్వర్డ్ అవసరం లేకుండానే ఇతరులు మీ వైఫైను కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ స్థానంలో WPA2 ను ఎంచుకోండి. ఆతర్వాత దాని దిగువన ఉండే బాక్స్లో పాస్వర్డ్ ఎంటర్ చేసి క్రియేట్ చేసుకోండి.
3.స్నేహితులకు, తెలిసినవాళ్లకు ఒక్కోసారి వైఫై పాస్వర్డ్ ఇస్తుంటారు. ఆ తర్వాత వారి మొబైల్లో ఫర్గెట్ నెట్వర్క్ చేయడం మరచిపోయుండొచ్చు. అందుకే తరచుగా వైఫై పాస్వర్డ్ను మార్చుకోవడం మంచిది.
4.మొబైల్లో వైఫైని ఆన్ చేసినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వైఫై నెట్వర్క్ల పేర్లు కనిపిస్తాయి. అలా ఇతరులకు మీ నెట్వర్క్ కనిపించకుండా చేసుకోవచ్చు. రూటర్ సెట్టింగ్స్లోకి వెళ్లి నెట్వర్క్ పేరు అందరికీ కనిపించకుండా చేయొచ్చు. అయితే మీ వైఫై ఎస్ఎస్ఐడీ (యూజర్ నేమ్) మీకూ కనిపించదు. దాన్ని గుర్తుంచుకోవాలి.
5.‘నేను వాడుతున్నది సెక్యూర్డ్ నెట్ కనెక్షనేనా’ అనే అనుమానం మీకూ ఉందా? అయితే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఏ) సాఫ్ట్వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఈ సాఫ్ట్వేర్ లేదా ఆప్ వాడితే హ్యాకర్ల దాడి నుంచి వీలైనంతవరకు తప్పించుకోవచ్చు.
6. ‘మా వీధి చివరివరకు మా వైఫై సిగ్నల్స్ వస్తాయి’ అని అంటుంటారు కొందరు. ఇల్లు, ఆవరణలో వైఫై సిగ్నల్ వస్తే చాలు కదా. అందుకే రూటర్ సెట్టింగ్స్లోకి వెళ్లి రూటర్ సిగ్నల్ రేంజ్ను తగ్గించుకోండి. సాధారణంగా 802.11ఎన్,802.11బి రేంజ్లు ఉంటాయి. వాటిని తగ్గించి 802.11జిగా మార్చుకుంటే సిగ్నల్ రేంజీతగ్గుతుంది
మీ దగ్గరలో వైఫై సిగ్నల్ ఉందా? తెలుసుకోవాలా ?
‘దగ్గర్లో ఎక్కడైనా వైఫై సౌకర్యం ఉందా?’... చాలామంది నోట ఈ ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి సమాధానం చెప్పడం కాస్త కష్టమే. అయితే మీ మొబైల్లో wifi
master key ఆప్ ఉంటే అదే మీకు సమాధానం చెబుతుంది. మీకు దగ్గర్లో ఉన్న వైఫై స్పాట్ల వివరాల్ని స్కాన్ చేసి చూపిస్తుంది. ఆప్ ఓపెన్ చేయగానే మీ పరిసరాల్లో ఉన్న వైఫై స్పాట్ల వివరాలు కనిపిస్తాయి. మీ పరిసరాల్లో వైఫై స్పాట్లు లేకపోతే... గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. అందులో మీ సమీపంలో (సుమారు 15 కిమీ) ఉన్న వైఫైల వివరాలు ఐకాన్లుగా కనిపిస్తాయి. అందులో ఫ్రీ వైఫైలు ఏవి, ఓపెన్ వైఫైలు ఏవి అనేదీ తెలుస్తుంది. దీంతోపాటు మీరు వినియోగిస్తున్న వైఫై సిగ్నల్ ఎంత బలంగా ఉందనే వివరాలు తెలుసుకోవచ్చు. మీరు వాడుతున్న వైఫై ఎంతవరకు సురక్షితమనే సమాచారమూ తెలుస్తుంది.
Subscribe to:
Posts (Atom)